Advertisement

తల్లికి వందనం నిధులు విడుదల..

Join Telegram
Join Now

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు అందించే ‘తల్లికి వందనం (Thalliki Vandanam)‘ నగదు నేడు (జూలై 22, 2026) తల్లుల ఖాతాల్లో జమ అవుతోంది. లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన ముఖ్యమైన రూల్స్, మరియు స్టేటస్ చెకింగ్ విధానం కింద చూడండి.

Advertisement

తల్లికి వందనం: ముఖ్యమైన రూల్స్ (Rules & Conditions)

  • డబ్బుల రూల్: ఒక్కో విద్యార్థికి మొత్తం రూ.15,000 మంజూరు అవుతాయి. అందులో రూ.2,000 స్కూల్ వికాస నిధికి కట్ అయ్యి.. నికరంగా రూ.13,000 తల్లి ఖాతాలో పడతాయి.
  • పిల్లల రూల్: గతంలోలా ఒకరికే కాకుండా.. ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా, అందరికీ విడివిడిగా ఈ పథకం వర్తిస్తుంది. (ఇద్దరుంటే ఇద్దరికీ రూ. 13,000 చొప్పున వస్తాయి).
  • అటెండెన్స్ రూల్: 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు కనీసం 75% హాజరు (Attendance) తప్పనిసరిగా ఉండాలి.
  • బ్యాంక్ రూల్: డబ్బులు పడాలంటే తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ (NPCI / e-KYC) లింక్ అయి ఉండటం తప్పనిసరి.
  • అనర్హతలు (ఎవరికి రావు?): కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉన్నా, ఇన్‌కమ్ టాక్స్ (Income Tax) కడుతున్నా, హాజరు 75% కన్నా తక్కువ ఉన్నా ఈ పథకానికి అనర్హులు.

ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా? సచివాలయానికి వెళ్లకుండానే మీ మొబైల్‌లో 2 విధానాల్లో స్టేటస్ తెలుసుకోవచ్చు:

  1. LEAP App ద్వారా: ఈ యాప్‌లో విద్యార్థి ఆధార్ నంబర్, PEN ID లేదా ఫోన్ నంబర్‌తో లాగిన్ అయి ‘Thalliki Vandanam Status’ పై క్లిక్ చేసి అర్హతను చెక్ చేయొచ్చు.
  2. SHSW పోర్టల్ ద్వారా: సచివాలయం అధికారిక వెబ్‌సైట్‌లో తల్లి ఆధార్ నంబర్ లేదా చైల్డ్ ఐడీ ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ (డబ్బులు పడ్డాయా లేదా) చూసుకోవచ్చు.

గమనిక: అర్హత ఉండి కూడా డబ్బులు పడకపోతే, వెంటనే మీ బ్యాంకులో NPCI లింక్ చేయించుకుని, సచివాలయంలో ‘గ్రీవెన్స్’ (Grievance) పెట్టుకోండి.

Advertisement