
Join Telegram
Join Now
తల్లికి వందనం పేమెంట్ ఫెయిల్ అయితే దరఖాస్తు ఎలా చేయాలి?
తల్లికి వందనం పథకం పేమెంట్ స్టేటస్‌లో “Payment Unsuccessful” లేదా “Payment Failed” అని చూపిస్తూ, తల్లి బ్యాంకు ఖాతాలో నగదు జమ కాకపోతే ముందుగా బ్యాంకు వివరాలను పరిశీలించాలి.
Advertisement
ముఖ్యమైన సూచన:
తల్లి బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందా, KYC పూర్తయిందా, ఆధార్ సీడింగ్,
NPCI/DBT మ్యాపింగ్, బ్యాంకు ఖాతాలోని పేరు మరియు ఆధార్ వివరాలు
100% సరిగా ఉన్నాయా అనే విషయాలను బ్యాంకులో నిర్ధారించుకోండి.
బ్యాంకుకు సంబంధించిన అన్ని వివరాలు సరిగా ఉన్నప్పటికీ పేమెంట్ జమ కాకపోతే, క్రింద అందించిన తెలుగు లేదా ఇంగ్లీష్ దరఖాస్తు PDFను డౌన్లోడ్ చేసి పరిశీలించండి. PDFలో ఉన్న నమూనా ప్రకారం తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి లేదా ప్రింట్ తీసుకొని అవసరమైన వివరాలను నమోదు చేయండి.
పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సచివాలయంలో సమర్పించి, తప్పనిసరిగా రసీదు లేదా గ్రీవెన్స్ రిఫరెన్స్ నంబర్ తీసుకోండి.
Advertisement