Advertisement

ఏపీ సదరం స్లాట్స్ ఎన్ని ఉన్నాయి? ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం జారీ చేసే సదరం (SADAREM) సర్టిఫికెట్ల ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేసి, స్లాట్ల లభ్యతను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే సదుపాయం కల్పించింది. లబ్ధిదారులు అధికారిక పోర్టల్‌లో తమ జిల్లా, ఆసుపత్రి, వైకల్యం రకాన్ని ఎంచుకుని ఏయే తేదీల్లో స్లాట్లు ఖాళీగా ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 25 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కాగా, మార్చి 30 నుంచి ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. స్లాట్ అందుబాటులో ఉన్నట్లు తెలియగానే ఆధార్ నంబర్, పాత మెడికల్ రిపోర్టులతో సమీప గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైద్య పరీక్షల అనంతరం కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయితే, ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పించే డిజిటల్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో లేదా సచివాలయాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Join Telegram
Join Now

Check AP SADAREM Slots

Live Updates
Connecting to database…
Advertisement