Advertisement

ఏపీ కొత్త పెన్షన్లు వాయిదా.. స్పోజ్ దరఖాస్తుల విధానం, సదరం అప్‌డేట్స్

AP New Pension Latest News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న మంజూరు కావాల్సిన కొత్త పెన్షన్ల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. లబ్ధిదారుల జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాలకు చేరకపోవడం మరియు కేవైసీ (KYC) ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, భర్తను కోల్పోయిన మహిళలకు (Spouse Category) మాత్రం సచివాలయాల ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

Join Telegram
Join Now

జూన్ 12న కొత్త పెన్షన్లను ప్రకటిస్తారని గతంలో భావించినప్పటికీ, ప్రభుత్వ డేటాలో ఉన్న సుమారు 1,50,000 మంది దరఖాస్తుదారుల లైవ్ వెరిఫికేషన్ (సజీవంగా ఉన్నారో లేదో నిర్ధారించడం) ఇంకా పూర్తి కాలేదు. సచివాలయాలకు అధికారిక జాబితాలు, మార్గదర్శకాలు అందకపోవడంతో ఈ ప్రక్రియ జూలై నెలకు వాయిదా పడే అవకాశం ఉంది. ముందుగా పాత డేటాలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత అర్హతను బట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు.

Advertisement

Spouse Pension Application Process

కొత్త పెన్షన్ల మంజూరు వాయిదా పడినప్పటికీ, పెన్షన్ పొందుతూ భర్త చనిపోయినట్లయితే వారి భార్యలు ‘స్పోజ్ కేటగిరీ’ కింద రూ.4,000 పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన మహిళలు జూన్ 12వ తేదీ లోపు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రాపర్ డాక్యుమెంట్లతో దరఖాస్తు సమర్పించాలి.

సమర్పించాల్సిన పత్రాలు (Required Documents)
దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్ మరియు అప్‌డేట్ హిస్టరీ
రేషన్ కార్డ్ (Ration Card)
భర్త మరణ ధృవీకరణ పత్రం (Death Certificate)
కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు
రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు & యాక్టివ్ మొబైల్ నంబర్

సచివాలయంలో సమర్పించిన దరఖాస్తులను ఎంపీడీఓ (MPDO) లేదా మున్సిపల్ కార్యాలయాలకు పంపుతారు. అక్కడ పత్రాలను పరిశీలించి, అర్హత ఉంటే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అనంతరం తిరిగి సచివాలయానికి దరఖాస్తు కేటాయించబడిన తర్వాత, లబ్ధిదారురాలు కేవైసీ (KYC) పూర్తి చేస్తే మరుసటి నెలలో పెన్షన్ మంజూరు అవుతుంది.

SADAREM Slots & UID Cards

దివ్యాంగుల (వికలాంగుల) పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. ప్రతి నెలా సదరం (SADAREM) స్లాట్స్ బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, వికలాంగత్వ శాతం ఆధారంగా (40% లోపు, 40% – 80%, మరియు 80% – 100%) ప్రత్యేకంగా యూఐడీ కార్డులు (UID Cards) జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు త్వరలో వెలువడనున్నాయి.

Advertisement