Advertisement

ఈ తప్పులు ఉంటే పేర్లు తొలగింపు | AP Voter List SIR 2026

భారత ఎన్నికల సంఘం దేశంలో ఓటర్ల జాబితా పారదర్శకతను పెంచేందుకు ‘ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR)’ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఉద్యోగాలు, విద్య కోసం వలస వెళ్తున్న వారి పేర్లు రెండు చోట్లా ఉండటం, మరణించిన వారి పేర్లు ఇంకా కొనసాగుతుండటం వంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. అర్హులైన పౌరులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా, అనర్హుల పేర్లను తొలగించేలా బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు.

Advertisement

ఓటరు జాబితా సవరణ (SIR) – ముఖ్యమైన తేదీలు

ఈ SIR కార్యక్రమం జూన్ 25, 2026 నుండి అధికారికంగా ప్రారంభమై, అక్టోబర్ 1, 2026 న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ముగుస్తుంది. ఈ లోపు వివిధ దశల్లో జరిగే ప్రక్రియను ఎన్నికల సంఘం ఖరారు చేసింది:

  • ఇంటింటి సర్వే (House Enumeration): 25-06-2026 నుండి 24-07-2026 వరకు
  • ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితా ప్రచురణ: 31-07-2026
  • క్లెయిమ్‌లు & అభ్యంతరాల స్వీకరణ: 31-07-2026 నుండి 30-08-2026 వరకు
  • నోటీసులు, విచారణ & పరిష్కారం: 31-07-2026 నుండి 28-09-2026 వరకు
  • తుది ఓటర్ల జాబితా ప్రచురణ: 01-10-2026

ఎన్యూమరేషన్ ఫారమ్ (EF) పంపిణీ మరియు సేకరణ

క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారాన్ని ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ERO) నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తారు. క్షేత్రస్థాయిలో ఈ సర్వే ప్రక్రియ క్రింది విధంగా సాగుతుంది:

  • ఇంటింటి సందర్శన: బూత్ స్థాయి అధికారులు (BLO) మీ ఇంటికి వచ్చి ముందుగా ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను (EF) రెండు ప్రతులలో అందజేస్తారు. ఏ ఇల్లూ మిస్ కాకుండా వారు కనీసం మూడు సార్లు ప్రతి ఇంటిని సందర్శిస్తారు.
  • వివరాల నమోదు: ఓటర్లు ఈ ఫారమ్‌లో తమ సరైన వివరాలను పూరించాలి. ఏవైనా సందేహాలుంటే BLO లే సహాయం చేస్తారు.
  • ఫారమ్ సమర్పణ & రశీదు: పూరించిన ఫారమ్‌ను BLOలు తీసుకుని, రెండవ కాపీపై సంతకం చేసి రశీదుగా ఓటరుకు ఇస్తారు. ఒకవేళ ఏ ఓటరు ఫారమ్ తిరిగి ఇవ్వరో, విచారణ అనంతరం వారి పేర్లను తుది జాబితా నుండి తొలగించే ప్రమాదం ఉంది (Absent/Death/Shifted/Double కింద).
  • కొత్త ఓటర్ల నమోదు: 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు హక్కు కోసం Form-6 మరియు డిక్లరేషన్ పూరించి ఇవ్వవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా ఫారమ్ సమర్పించే విధానం

ఇంటికి BLO వచ్చినప్పుడు అందుబాటులో లేనివారు, లేదా స్వయంగా ఆన్‌లైన్‌లో చేయాలనుకునే వారు ఈ కింది విధంగా పూర్తి చేయవచ్చు (ఇది ఓటరు జాబితా, ఆధార్ కార్డులో పేరు సరిపోలిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది):

  • భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ‘voters.eci.gov.in’ ను ఓపెన్ చేయాలి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఓటరు కార్డ్ (EPIC) నంబర్ ద్వారా ఓటీపీ నమోదు చేసి లాగిన్ కావాలి.
  • స్క్రీన్‌పై ఉన్న ‘Fill Enumeration Form’ ఆప్షన్‌ను ఎంచుకుని వివరాలను తప్పులు లేకుండా పూరించాలి.
  • ఆ తర్వాత ఈ-సైన్ (e-sign) పేజీలో తిరిగి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

ఈ సర్వే దశలో ఓటరు ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆధార్ నంబర్ ఇవ్వడం కూడా పూర్తిగా ఐచ్ఛికం (Optional).