Advertisement

Thalliki Vandanam: జులై మూడో వారంలో డబ్బులు.. ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తింపు

Thalliki Vandanam Latest News: ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లికి వందనం’ పథకం అమలుపై మంత్రి లోకేశ్ ఈరోజు విద్యాశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఈ స్కీం కింద ఆర్థిక సాయం అందించేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement

సమీక్షా సమావేశంలో విద్యాశాఖ అధికారులు లబ్ధిదారులకు సంబంధించిన తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ గురించి మంత్రికి వివరించారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని తెలిపారు. ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే, జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి స్పష్టం చేశారు.

Advertisement