Advertisement

Thalliki Vandanam: రేపే అకౌంట్లలోకి డబ్బులు.. ఈ తప్పులు చేయకండి!

Join Telegram
Join Now

స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘తల్లికి వందనం(Thalliki Vandanam)’ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జూలై 22 నుంచి 24వ తేదీలోగా నేరుగా రూ.13,000 చొప్పున జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement

డబ్బులు జమ కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ పథకం కింద నిధులు ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి. అంతేకాకుండా, బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం కావడంతో పాటు, NPCI మ్యాపింగ్, ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ గతంలో ఇవి పూర్తిచేయకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్లి స్టేటస్ కనుక్కోవాలని విద్యాశాఖ సూచించింది.

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ (SC) విద్యార్థులు మాత్రం, ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు తమ పేరు మీద కొత్తగా బ్యాంక్ అకౌంట్ తెరవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

లబ్ధిదారుల వివరాలు, బడ్జెట్ కేటాయింపులు

ఈ విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అలాగే 47,555 మంది మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం మొత్తం రూ.10,120.78 కోట్లను కేటాయించింది.

సైబర్ మోసాలపై హెచ్చరిక

తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ పథకం పేరుతో మొబైల్‌కు వచ్చే అనుమానాస్పద లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు. ఎలిజిబిలిటీ, బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్‌లను కేవలం అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే సరిచూసుకోవాలి. పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, స్థానిక సచివాలయ సిబ్బందిని లేదా స్కూల్ ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని స్పష్టం చేశారు.

Advertisement