Advertisement

తల్లికి వందనం.. అంగన్‌వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు గుడ్ న్యూస్

Join Telegram
Join Now

Thalliki Vandanam: అంగన్‌వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు మరో గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 22న ‘తల్లికి వందనం’ పథకం నిధులను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఈ పథకం లబ్ధిదారుల పరిధిని మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

17 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలకు లబ్ధి

ఈసారి దాదాపు 17 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలకు (ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు) కూడా ‘తల్లికి వందనం’ స్కీమ్‌ను ప్రభుత్వం వర్తింపజేసింది. అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో తలా రూ. 13 వేల చొప్పున నేరుగా నగదు జమ చేయనుంది. అంగన్‌వాడీలతో పాటు, పారిశుద్ధ్య (శానిటేషన్) వర్కర్ల పిల్లలకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పథకం నిధుల విడుదల మరిన్ని వివరాల కోసం తల్లికి వందనం జులై 22 అప్‌డేట్ లింక్‌ను చూడవచ్చు.

గతంలో నిబంధనల వల్ల దూరం

గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల కారణంగా అంగన్‌వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉండేది కాదు. తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ సడలింపు నిర్ణయంతో వేలాది మంది కింది స్థాయి ఉద్యోగుల కుటుంబాలకు, వారి పిల్లల చదువులకు ఎంతో మేలు జరగనుంది.

Advertisement