Advertisement

తల్లికి వందనం గ్రీవెన్స్ విధానం 2026.. అనర్హుల జాబితాలో పేరుంటే ఇలా చేయండి!

Join Telegram
Join Now

తల్లికి వందనం (Thalliki Vandanam) పథకంలో మీకు అర్హత ఉండి కూడా.. సాంకేతిక లోపాల వల్ల మీ పేరు అనర్హుల (Ineligible) జాబితాలో ఉంటే కంగారు పడకండి. సరైన ఆధారాలతో సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకుంటే మళ్లీ డబ్బులు పొందవచ్చు.

Advertisement

ఏ సమస్యకు ఏ ప్రూఫ్ తీసుకువెళ్లాలి?

  • కరెంట్ బిల్లు సమస్య (300 యూనిట్లు దాటినట్లు వస్తే): విద్యుత్ శాఖ అందించిన మీటర్ డీ-సీడింగ్ (Deseeding) రసీదు.
  • వాహనం (4-Wheeler ఉన్నట్లు వస్తే): అది కేవలం ఆటో లేదా ట్రాక్టర్ అయితే.. దానికి సంబంధించిన ఆర్‌సి (RC) బుక్ కాపీ.
  • ఇన్‌కమ్ టాక్స్ సమస్య: మీరు నిజంగా టాక్స్ కట్టకపోతే CA (చార్టర్డ్ అకౌంటెంట్) ద్వారా తీసుకున్న సర్టిఫికెట్.
  • పొలం లేదా భూమి సమస్య: మీ పొలానికి సంబంధించిన 1B/అడంగల్ రికార్డులు.
  • ప్రభుత్వ ఉద్యోగం: పొరపాటున CFMS ఐడీ పడితే సంబంధిత మినహాయింపు ధృవీకరణ పత్రం.
  • పేరు/డేటా తప్పులు: తల్లి మరియు విద్యార్థి సరైన ఆధార్ కార్డులు.

ఎలా దరఖాస్తు చేయాలి? (సింపుల్ ప్రాసెస్): పైన చెప్పిన మీ సమస్యకు సంబంధించిన ప్రూఫ్స్, మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ తీసుకుని మీ సమీప గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లండి.

అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ (DA) లేదా వెల్ఫేర్ సెక్రటరీ మీ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి గ్రీవెన్స్ (Grievance) నమోదు చేస్తారు. ఆ తర్వాత అధికారుల వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీ పేరు తిరిగి అర్హుల జాబితాలోకి వస్తుంది!

Advertisement